రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తన్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకుడు. నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల తేదీని గురువారం చిత్ర బృందం సురేష్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఇక రానా హీరోగా చేస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్గా వస్తోంది. రానా రాజకీయ నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది.