‘‘సినిమాకు వచ్చే డబ్బులు, అవార్డుల సంగతి పక్కనపెట్టేస్తే… నీకైతే మంచి పేరు వస్తుంది’’ అని ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానతో చిరంజీవి అన్నారట. తొలి సినిమాతో ప్రతి దర్శకుడు పేరు కోరుకుంటాడు. కానీ దాంతో పాటు సినిమా హిట్ అయ్యి మంచి వసూళ్లు రావాలి. అలాగే ప్రశంసలు, అవార్డులు కూడా రావాలని కోరుకుంటారు. కానీ కేవలం పేరు మాత్రమే వస్తే ఏమొస్తుంది. అంటే సినిమా ఫలితం మీద చిరంజీవికి అంతగా నమ్మకం లేదా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.