తెలుగు చిత్ర పరిశ్రమలో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందించిన జంబలకిడి పంబ సినిమాతో నటి ఆమని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ భామ. ఇక ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా తరువాత ఆమని వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస ఆఫర్లు ఆమెను వరించాయి. తెలుగు, తమిళ నాట ప్రముఖ హీరోలందరి సరసన హీరోయిన్గా నటించి ప్రేక్షకులను మెప్పించింది.