తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు బ్రహ్మానందం. ఆయన డైలాగ్ చెప్పకుండా ప్రేక్షకులను నవ్వించగల టాలెంట్ ఉన్న లెజెండరీ కమెడియన్. ఇక హాస్య బ్రహ్మ అని ఆయనకు పేరు. బ్రహ్మానందం ఫేస్ చూస్తే చాలు నవ్వడం ఖాయం. తెరపై ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్లు, చెప్పే డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి.