"శ్రీకృష్ణార్జునయుద్ధం" సినిమా షూటింగ్ ముగిసిన తరువాత ఇక ఆ సినిమాను విడుదల చేయాలన్న సమయంలో ఇద్దరిలో ఎవరి పేరు ముందు వేయాలి అన్న సందేహం కలిగింది. అయితే ఇద్దరికీ సమానమైన, గొప్ప అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎవరి పేరు ముందు వేసిన గొడవలవుతాయి అన్న కారణంతో ఈ విషయం తెలుసుకున్న కె.వి.రెడ్డి గారు టైటిల్స్ లో వారిద్దరి పేర్లు వేయకుండా, కృష్ణార్జున యుద్ధం కలిసి వస్తున్న దృశ్యం వేసి అందరికీ సమాన న్యాయం చేశారు.