ఆహుతి ప్రసాద్ అక్కినేని నాగార్జున మొదటి చిత్రం విక్రమ్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయ్యడు. ఆ తరువాత రాజశేఖర్ ఆహుతి సినిమాలో విలన్గా నటించి, అందరి మన్ననలు పొందాడు. మరికొద్ది కాలానికి నాగార్జున నిన్నే పెళ్ళాడతా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్నాడు.ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 30 సంవత్సరాల పాటు 150 సినిమాలలో నటించి,తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఆహుతి ప్రసాద్ విజయలక్ష్మీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని, వీరికి కార్తీక్ ప్రసాద్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఆహుతి ప్రసాద్ 2015వ సంవత్సరంలో క్యాన్సర్ బారిన పడి చనిపోవడంతో కుటుంబ పెద్దగా మారి కుటుంబ వ్యవహారాలు చూసుకుంటున్నాడు కార్తీక్.