ఆది పురుష్  మొదటి రోజే ఫైర్ యాక్సిడెంట్ కావడం వలన షెడ్యూల్ తారుమరయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా కోసం ప్రభాస్ 15 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు షూటింగ్ కు బ్రేక్ పడడంతో మరో కొత్త కాల్షీట్స్ రెడీ చెయ్యాలి. ఓ వైవు సలార్ షూటింగ్ కు ఇబ్బంది కలగకుండా డేట్స్ సెట్ చేసుకోవాలి అంటే కష్టమే. నెలరోజుల్లో సగం సగం డేట్స్ ను డివైడ్ చేసుకొని రెండు సినిమాలతో బిజీగా మరాల్సి ఉంటుంది. రెండు సినిమాల షూటింగ్స్ వలన కొన్నిసార్లు అస్సలు రెస్ట్ దొరికే అవకాశం లేదని తెలుస్తోంది.