భారీ బడ్జెట్ తో 1997 మే 29 న ఏ వి ఎస్ దర్శకత్వం లో డి.రామా నాయుడు నిర్మించిన సూపర్ హీరోస్ సినిమాను విడుదల చేశారు. ఇక ఎన్నో అంచనాలతో థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. నవ్వుల సినిమా కాస్తా వికటించి నవ్వుల పాలయింది. తల్లి సెంటిమెంట్ ను అతిగా జోప్పించడం తోపాటు దెయ్యాల రాజుగా సత్య నారాయణ ట్రాక్ బేడిసి కొట్టింది.ఇక ఈ చిత్రం లో ఏ వి ఎస్,బ్రహ్మీ బాగా ఓవర్ చేసారనిపించింది.ఇందులో "అచ్చ తెలుగు భాషరా అమ్మంటే " అనే పాట స్వయానా ఏ వి ఎస్ రాసారు. ఇక ఈ పాటకు మణిశర్మ చక్కని సంగీతం అందించడం తో గొప్ప స్థాయికి చేరుకున్నాడు