2014లో "చందమామలో అమృతం" పేరుతో భారీగా సినిమాను తెరకెక్కించాడు గుణ్ణం గంగరాజు. యాక్టింగ్ తో పాటు ప్రొడక్షన్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, ఈ సినిమాకు మొత్తం 5 కోట్ల బడ్జెట్ పెట్టి నిర్మించారు. అయితే విడుదల అయిన తర్వాత చూసుకుంటే మాత్రం చేతికి 14 లక్షలు వచ్చింది. అంతేకాకుండా ఈయన తన కొన్ని ఆస్తులు కూడా అమ్ముకున్నాడు. అమృతం సీరియల్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రం భారీ పతనాన్ని చవి చూసింది.