నిజానికి నితిన్ చెక్ సినిమా  ఫిబ్రవరి 19న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు కానీ.. ఇప్పుడు ఓ వారం వెనక్కి జరిగింది.ఫిబ్రవరి 26న ఈ చిత్రం విడుదల కాబోతుంది. దాంతో ఇప్పుడు అదే రోజున అల్లరి నరేష్ 'నాంది' చిత్రాన్ని విడుదల చెయ్యడానికి ఆ చిత్రం దర్శకనిర్మాతలు ముందుకు వచ్చారు. అవును 'నాంది' చిత్రం ఫిబ్రవరి 19నే విడుదల కాబోతుంది.ఒకవేళ అదే రోజున 'చెక్' కూడా విడుదలయ్యి ఉంటే.. 'నాంది' కి పెద్ద దెబ్బే పడేది. అసలే నరేష్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు అన్నీ నిరాశపరిచాయి. దాంతో చాలా కష్టపడి ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ చేసాడు.ఇక నితిన్ వెనక్కి తగ్గడంతో అల్లరి నరేష్ అనుకున్న టైం కి నితిన్ కంటే ముందే తన సినిమాతో వచ్చేస్తున్నాడు.