కెజియఫ్ 2 సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎలాంటి అంచనాలు ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెజియఫ్ మొదటి భాగం సంచలన విజయం సాధించింది. ఈ సినిమా కోసం అన్ని భాషల ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కన్నడలో ఈ చిత్ర బిజినెస్ భారీగా జరుగుతోంది. ఒకప్పుడు 40 కోట్ల బిజినెస్ అంటేనే నోరెళ్లబెట్టే వాళ్లు ఇప్పుడు ఈ సినిమాకు మాత్రం 200 కోట్లకు పైగానే లెక్కలు చెబుతున్నారు.