అప్పట్లో ప్రింటింగ్ బిజినెస్ కు బాగా డిమాండ్ ఉండటంతో 50 లక్షల అప్పు చేసి మరీ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు . ఇక బిజినెస్ బాగా జరుగుతున్న సమయంలో , ఇక అచ్యుత్ సినిమాల వైపు దృష్టి సారిస్తూ తన బిజినెస్ ను నమ్మిన స్నేహితులకు ఇచ్చాడు . అయితే ఆ స్నేహితులు లాభాలను చూపకుండా, దివాలా తీసే పరిస్థితి కి తీసుకు వచ్చారు . ఇక తీవ్ర డిప్రెషన్ కు గురై , నమ్మిన వాళ్లని మోసం చేశారని ఎప్పుడు బాధ పడుతూ ఉండేవాడు . ఇక ఈ కారణంగానే అచ్యుత్ 42 సంవత్సరాలు కూడా నిండకుండానే హార్ట్ ఎటాక్ తో మరణించాడు.