బుల్లితెరపై ప్రేక్షకులను గత కొన్ని సంవత్సరాలుగా కడుపుబ్బా నవ్విస్తున్న షో జబర్ధస్త్. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్ లు బుల్లితెరకు పరిచయమైయ్యారు. జబర్ధస్త్‌లో కొందరు స్టార్స్ చాలా పాపులర్. అలాంటి వారిలో రాంప్రసాద్ ఒకరు. ఆటో రాంప్రసాద్ గా జబర్ధస్త్ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసే రాంప్రసాద్ పంచ్‌లను లైక్ చేసే వారి సంఖ్య బాగా ఎక్కువనే చెప్పాలి. అందుకే సోషల్ మీడియాలో రాంప్రసాద్ కు ఫాలోయింగ్ కూడా బాగానే ఉంటుంది.