తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. వరుస సినిమాలతో సత్తా చూపెడుతున్న అనిల్ రావిపూడి.. త్వరలో నటుడిగా లక్ పరీక్షించుకోనున్నట్టు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినపడుతున్నాయి. ఇక త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. 100కు పైగా సినిమాలు డైరెక్ట్ చేసి, ఎందరో హీరోల కెరీర్ నిలబెట్టిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇప్పుడు 78 ఏళ్ల వయసులో ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు.