తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. రాజాదిగ్రేట్ సినిమా తరువాత వచ్చిన సినిమాలు అన్ని ప్లాప్ లో నిలిచాయి. క్రాక్ సినిమా మంచి విజయం సాధించడంతో రవితేజ మళ్ళి బరిలోకి వచ్చారు. ఇక సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా 50 శాతం ఆక్యుపెన్సీతోనే 38 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.