ప్రముఖ నటి కరాటే కల్యాణి ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ.." ప్రైవేటీకరణ విషయం తెలిసి తొలుత బాధగా అనిపించినా, లోతుగా ఆలోచిస్తే ఇది సరైన నిర్ణయమే అనిపిస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అన్నీ ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని, ఎన్డీయే సర్కారును సమర్థించారు.