అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో బన్నీకి జంటగా రష్మిక సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక పుష్ప షూట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అల్లు అర్జున్తో స్ర్కీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో నటించేటప్పుడు ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.