తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమాతో తెరంగ్రేటం చేసిన అల్లు అర్జున్ వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోలో ఒక్కసారిగా మారాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు పరిశ్రమలో ఉన్న క్రేజే వేరు. స్టైలిష్ లుక్, యాక్టింగ్‌లో బన్నీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన డ్యాన్స్, యాక్టింగ్ స్కిల్స్‌తో అభిమానులను కట్టిపడేస్తాడు.