ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కోలీవుడ్ భామ అనుపమా పరమేశ్వరన్. ఇక అందం, అభినయం కలగలిపిన అతికొద్ది మంది నటీమణుల్లో మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్ ఒకరు. చేసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ బ్యూటీ. ఇక తన క్యూట్ లుక్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంటోన్న అనుపమ కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది.