సినిమా నటులకి పిచ్చి అభిమానులుంటారు. తమ అభిమాన నటులు వాడిన వస్తువులంటే వారికి మరీ పిచ్చి. అలాంటి వాటికోసం ఎంతయినా ఖర్చు చేస్తారు, అది తమ దగ్గర మాత్రమే ఉందని చెప్పుకోడానికి భలే ఇష్టపడతారు. అలాంటి ఓ పిచ్చి అభిమానిని ఫుల్లుగా బుక్ చేశారు కొంతమంది మోసగాళ్లు. హీరో సల్మాన్ ఖాన్ పేరు చెప్పి, ఆయన గుర్రం అమ్ముతామని చెప్పి ఏకంగా రూ.12లక్షలకు టోకరా వేశారు.