గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెరపై కడుపుబ్బా నవ్విస్తున్న షో జబర్దస్త్. ఈ షో ద్వారా చాల మంది కమెడియన్స్ బుల్లితెరకు పరిచయం అయ్యారు. ఇప్పటికే జబర్దస్త్ షో నుంచి వచ్చిన వాళ్లకు ఈ బాధలు కూడా తెలుసు. ఇప్పుడు హరి కూడా ఇదే చెప్పాడు. ఈయన జబర్దస్త్ ప్రేక్షకులకు హరితగా బాగా పరిచయం. భాస్కర్ సహా అందరి స్కిట్స్లో కూడా అమ్మాయి వేషాలు వేస్తుంటాడు హరి.