కెరీర్ తొలి రోజుల్లో కనీసం జీతం కూడా తీసుకోకుండా పని చేసిన సునీల్, ఇప్పుడు ఒక సినిమాలో హీరోగా చేస్తే దాదాపు రెండున్నర కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నాడు.సునీల్ అంత పారితోషికాన్ని తీసుకోవడానికి గల కారణం సునీల్ నటించిన అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద ఎలాంటి విజయాన్ని సాధించాయో, పెద్దగా చెప్పనవసరం లేదు.భీమవరం బుల్లోడు, జక్కన్న సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ, సునీల్ కారణంగా బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్ల ను సాధించిపెట్టాయి. అందుకే నిర్మాతలు సునీల్ కు అంత భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి కారణం అని చెప్పవచ్చు.