తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వారి అభిమానాని సొంతం చేసుకున్నాడు. ఇక సునీల్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యి ఇప్పటికే మూడు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా సునీల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి.