తెలుగు చిత్ర పరిశ్రమలో యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన షోలతో, మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది సుమ. తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్స్ వచ్చినా కూడా సుమ తర్వాతే. ఆమెను దాటి ఎవరూ ముందుకు వెళ్లలేరు అనేది ఒప్పుకుని తీరాల్సిన సత్యం. క్లీన్ ఇమేజ్ తో ముందుకు వెళ్లిపోతుంది యాంకర్ సుమ.