ఇండస్ట్రీలో చాల మంది దర్శకులు ఉన్నారు. కానీ కొంతమందికే సరైన గుర్తింపు లభిస్తుంది. అలాంటి వారిలో ఒక్కరు సుకుమార్. ప్రస్తుతం ఈయన శిష్యుడు తెరకెక్కించిన ఉప్పెన సినిమా సాధించిన విజయంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు. దాంతో పాటు తన సినిమా పుష్పపై కూడా ఫోకస్ చేసాడు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.