బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్స్ మొత్తం 16 మంది హౌస్ మేట్స్ లో బిగ్ బాస్ ఇప్పటికే కొంతమంది ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వారిలో హైపర్ ఆది, యాంకర్ రవి, షణ్ముఖ్, యాంకర్ వర్షిని, ప్రముఖ టిక్ టాక్ సెలబ్రిటీ దీపిక పిల్లి పేర్లు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి.ఇప్పుడు రాబోయే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి వ్యాఖ్యాతగా సూపర్ స్టార్ మహేష్ బాబును వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు అని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్టార్ మా యాజమాన్యం మహేష్ బాబు తో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అయితే మహేష్ బాబు నుంచి కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.