'సర్కారు వారి పాట' సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ ఒకటి దుబాయ్ లో జరుగుతోన్న సంగతి తెలిసిందే.దాదాపు 25రోజుల పాటు ఈ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. అక్కడ షూటింగ్ పూర్తి చేసుకున్నాక దుబాయ్ డైరీస్ పేరుతో ఓ స్పెషల్ వీడియోను వదలబోతుందట యూనిట్. షూటింగ్ లొకేషన్లతో పాటు ఆన్ లొకేషన్స్ ముచ్చట్లతో ఈ వీడియో రూపొందనుందట.