శంకర్ ని దిల్ రాజు కంట్రోల్ చేయగలడా..? దిల్ రాజు షరతులు శంకర్ కి వర్తిస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే దిల్ రాజు ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చాడని.. సినిమాని ఇంతలోనే పూర్తి చేయాలి.. ఈ టైమ్ కి పూర్తి చేయాలనే నిబంధనలతో రంగంలోకి దిగబోతున్నాడని చెబుతున్నారు. ఇలాంటి షరతులు శంకర్ కి కొత్తేమీ కాదు. ఎన్ని షరతులు పెట్టినా.. ఆయన అనుకున్న సమయానికే సినిమాని పూర్తి చేస్తాడు.