ఆర్ఆర్ఆర్’ తమిళ హక్కుల కోసం భారీ మొత్తంలో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే లైక్ ప్రొడక్షన్స్ సంస్థ ‘ఆర్ఆర్ఆర్’ తమిళ వెర్షన్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాని కోసం ఏకంగా రూ.45 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ఒక్క రాజమౌళి పేరుతోనే ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. పబ్లిసిటీ, ఇతర ఖర్చులు కలుపుకుంటే ఈ సినిమాకి తమిళంలో రూ.50 కోట్ల షేర్ వస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది.