తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ మహారాజ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను మెప్పిస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక సినీ ఇండస్ట్రీలో ఎలాంటి అండ దండలు లేకుండా స్వయం కృషితో ఎదిగిన హీరోల్లో రవితేజ ఒకరు. ఇక తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రవితేజను అందరూ ముద్దుగా మాస్ మహారాజ అని పిలుచుకుంటూ ఉంటారు.