ఉప్పెన' చిత్రం రిలీజైన 4 రోజులకే రూ.32 కోట్ల వరకూ షేర్ ను రాబట్టి అందరిని ఆశ్చర్య పరిచిందనే చెప్పాలి.ఈ ఏడాది అత్యథిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా ఇప్పటివరకూ మాస్ మహారాజా రవి తేజ 'క్రాక్' సినిమా పేరు మీద ఉండగా.. ఇప్పుడు ఆ చిత్రం వసూళ్లను అధిగమించే దిశగా 'ఉప్పెన' దూసుకుపోతుంది. 'క్రాక్' చిత్రం రూ.37కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. 'ఉప్పెన' చిత్రం మరో 2 రోజుల్లో 'క్రాక్' వసూళ్లను మించే అవకాశం ఉంది.