'నాకు ఎలాంటి సినిమాలు నప్పుతాయి, ఎలాంటి కథలు సరిపోతాయి, ఏ పాత్రలు బాగా చేయగలనో ఒక ఐడియా ఉంది. ప్రస్తుతం అవకాశాలు బాగానే వస్తున్నాయి. అయితే అవకాశాలు తగ్గాయని, ఏ సినిమా పడితే అది ఒప్పుకోను. అవకాశాల కోసం ఓపికగ్గా ఎదురు చూస్తాను. వరుస అవకాశాలు వస్తున్నప్పుడు, వాటిలోంచి సరిపోయే కథలు ఎంచుకోవడం చాలా కష్టమైన పని. అయితే ఈ పని చాలా చాకచక్యంగా చేయగలననే నమ్మకం నాకుంది' అని షాకింగ్ కామెంట్స్ చేసింది కియారా.