జీ తెలుగులో ప్రసారమైన పక్కింటి అమ్మాయి సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైంది ప్రీతీ అస్త్రాని. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ చేస్తుండగానే ఈ భామకి సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక ఆ మధ్య అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్ హీరోగా నటించిన మళ్ళీ రావా చిత్రంలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించింది.