బుల్లితెరపై 1990లో ‘రామాయణ్’ అనే హిందీ సీరియల్ ఒకటి ప్రసారం అయ్యేది. అప్పట్లో ఈ సీరియల్ మంచి విజయం సాధించింది. ఇందులో రాముడి పాత్రలో అరుణ్ గోవిల్ అనే వ్యక్తి నటించాడు. దాంతో అతనే రాముడు అని ప్రేక్షకులు తెగ ఆదరించేవారు. రామాయణం ఆదివారం ఉదయం వస్తోందని తెల్సి చాలామంది ఇళ్ళు కడిగి ముగ్గులు పెట్టేవారు.