లయ చదువుకునే రోజుల్లో ఏడు సార్లు స్టేట్ చాంపియన్ అవార్డులను పొందింది. ఇక నేషనల్ లెవెల్ చెస్ లో రెండవ స్థానంలో నిలిచింది. అన్నిట్లోనూ ఎప్పటికప్పుడు ఆక్టివ్ గా పాటిస్పేట్ చేస్తూ ముందుండేది లయ. ఇక క్లాసికల్ డాన్సర్‌గా 50కిపైగా స్టేజి షోలను ఇచ్చి, కంప్యూటర్ అప్లికేషన్ లో మాస్టర్ డిగ్రీని కూడా కంప్లీట్ చేసింది.తెలుగులో ఈమె 60 చిత్రాలకు పైగా నటించింది.అలా తన ప్రస్థానాన్ని కేవలం తెలుగులోనే కాకుండా తమిళం,కన్నడ, మలయాళం భాషలలో కూడా నిలుపుకుంది. ఈమె తెలుగులో నటించిన మనోహరం, ప్రేమించు సినిమాలకు నంది అవార్డును కూడా గెలుచుకుంది.