స్రవంతీ రవికిషోర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో, కలిసి తీయబోయే సినిమాలో హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకునేందుకు ఆడిషన్స్ నిర్వహిస్తున్న సమయంలో, రామోజీ ఫిలిం సిటీ లోనే ఆడిషన్స్ జరుగుతుండడంతో, అక్కడే షూటింగ్ జరుగుతున్న ఇష్టం సినిమా సెట్స్ కి వెళ్లి స్రవంతి రవి కిషోర్ అక్కడ శ్రేయని చూసి ఎంతో ఆకర్షితుడయ్యాడు. ఇక వెంటనే తను తీయబోయే నువ్వే నువ్వే సినిమా కథ చెప్పి, ఆమెతో అక్కడే అగ్రిమెంట్ పై సైన్ కూడా చేయించుకున్నాడు. శ్రేయ కి ప్రముఖ హీరో రామ్ తండ్రి మరియు నిర్మాత అయిన స్రవంతి రవి కిషోర్ తోనూ, హీరో రామ్ ఫ్యామిలీ తోనూ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుండి మంచి సాన్నిహిత్యం ఉంది. శ్రేయ ని రామ్ ఫ్యామిలీ సొంత ఇంటి అమ్మాయిలాగా చూస్తూ వచ్చారు.