1966 ఫిబ్రవరి 22 తారీకున మద్రాస్ లో జన్మించాడు తేజ ఉరఫ్ జాస్తి ధర్మ తేజ... చిన్నతనంలోనే తల్లి దండ్రులను కోల్పోయిన తేజా...ఎన్నో కష్టాలను అనుభవించాడు. కష్టాలనే మెట్లుగా చేసుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.. మొదట లైటింగ్ అండ్ సౌండ్ డిపార్టమెంట్ లో పనిచేశాడు.ఆ తర్వాత కెమెరా డిపార్డ్ మెంట్ లో కొద్దికాలం పనిచేశాడు. ఆ తర్వాత కెమెరామెన్ గా పనిచేసే సమయంలో దర్శకుడిగా మారి ఎన్నో హిట్ సినిమాలను తీసాడు..