తెలుగు చిత్ర పరిశ్రమలో రకుల్ ప్రీత్ సింగ్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో నితిన్ సరసన నటించిన చెక్ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌కు కాస్త దూరంగానే ఉంది రకుల్.