ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన క్రాక్, మాస్టర్ సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి. రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే లాభాల్లోకి ప్రవేశించిన ఈ సినిమాను హిందీలో రీమేక్ కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఫిబ్రవరిలో విడుదలైన ‘ఉప్పెన’ సినిమా మాత్రం కలెక్షన్ల ఉప్పెన సృష్టిస్తోంది.