తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యూష గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. ఉజ్వలతారగా వెలగాల్సిన ఓ తార చిన్న వయసులోనే నేలరాలిపోయింది. అందం, అభినయంతో చిన్న వయసులోనే ప్రతిభగల నటిగా పేరుసంపాదించుకున్న ప్రత్యూష 23 ఫిబ్రవరి 2002న అనుమాస్పదంగా మరణించింది. ప్రత్యూష మరణం అప్పట్లో ఓ సంచలనమే సృష్టించింది.