చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. ఇక చాల మంది ఒక్క అవకాశం.. ఒక్క హిట్ అని సినీ ఇండస్ట్రీలో ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లు ఎందరో. కానీ హిట్ వచ్చిన ఎవరినైనా ఇండస్ట్రీ చూసే విధానం వేరుగా ఉంటుంది. అందలం ఎక్కిస్తుంది. అవకాశాలతో పాటు ఇమేజ్ను కట్టబెడుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఎంజాయ్ చేస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు సానా.