తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. అయితే ఎన్టీఆర్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక, తాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా తనదైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.