ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆయన చెప్పుకొచ్చాడు. చంద్ర శేఖర్ యేలేటి మాట్లాడుతూ.." ఈ చిత్రం కథాంశం ఏమిటంటే.. ఒక చిన్న పొరపాటు వల్ల జీవితం తారుమారైన ఓ యువకుడు తన తెలివితేటలతో, తన జీవితాన్ని ఎలా కంట్రోల్ లోకి తీసుకొచ్చాడు అనేది చెక్ సినిమా స్టోరీ. ఇంతకుముందే నితిన్ తో ఒక కథను అనుకొని,దాని మీద పనిచేసి, సెకండాఫ్ వర్కౌట్ కాక వదిలేసాము. ఈ సినిమాతో మళ్లీ మా ఇద్దరి కాంబినేషన్ కుదిరింది. ఇక నితిన్ తప్పా ఈ పాత్రలో హీరోగా నేను ఎవరిని ఊహించుకోలేను. తను లేకపోతే ఈ చిత్రం లేదు. ఇక కళ్యాణి మాలిక్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది.. " అంటూ చెప్పుకొచ్చాడు.