తెలుగు చిత్ర పరిశ్రమలో వెరైటీ కథనాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు డైరెక్టర్ తేజ. తన సినిమాల ద్వారా తేజ ఎంతో మంది కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వారిలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం. చిత్రం సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు ఉదయ్ కిరణ్. తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో నువ్వు నేను, ఔనన్నా కాదన్నా సినిమాలు కూడా వచ్చాయి.