దృశ్యం 2 రీమేక్ ఫ్రెష్ గా ఉండటం కోసం స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగించాలని వెంకటేష్ భావిస్తున్నారు. ఇదే విషయమై తన సోదరుడు, ఈ సినిమా నిర్మాత సురేష్ బాబు తో వెంకటేష్ చర్చించారు. అయితే ఆ ఐడియా నచ్చడంతో సురేష్ బాబు కూడా స్క్రిప్ట్ లో చేంజెస్ చేసేందుకు ఓకే అన్నారు. దీనితో వెంకటేష్ కోరికమేరకు ప్రస్తుతం డైరెక్టర్ జీతూ జోసెఫ్ స్క్రిప్ట్ లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నారని సమాచారం.