సింధూర పువ్వ సినిమాకు సంబంధించిన హీరోయిన్ ని ఎంపిక చేసుకొనేటప్పుడు అందులో భాగంగానే రాధిక చెల్లెలు నిరోషా ని, దర్శకుడు దేవరాజ్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఫోటోలోని నిరోషా ను హీరో రాంకీ చూసినప్పుడు ఎవరీ అమ్మాయి పని పిల్లలా ఉంది అని అన్నాడు..చివరికి ఆ అమ్మాయినే తమిళంలో సింధూరపూవే సినిమాలో సెలెక్ట్ చేయడం జరిగింది. అలా రాంకీ, నిరోషా లు కలిసి నటించిన ఈ చిత్రం తెలుగులో బ్లాక్ బాస్టర్ ని అందుకుంది . ఆ తరువాత వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలు నటించారు. ఒకరికొకరు బాగా అర్థం చేసుకొని చివరకు పెళ్లి కూడా చేసుకున్నారు.