సినిమాలు వరుసగా ప్లాప్ అయితే కెరీర్ గాడి తప్పుతుందని చిరంజీవి సాయి ధరమ్ తేజ్ కి చెప్పాలని నిర్ణయించుకున్నారట. సాయిధరమ్ తేజ్ కెరీర్ ప్రారంభంలో చిరంజీవి సినిమాల స్క్రిప్ట్ విషయంలో జోక్యం చేసుకునే వారు. కానీ కొంత కాలం తర్వాత సాయిధరంతేజ్ తన సొంతంగా స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేసుకోవడం ప్రారంభించారు. అందువల్ల ఆయనకు ఎన్నో పరాజయాలు ఎదురయ్యాయి. దీనితో మళ్లీ చిరంజీవి తన మేనల్లుడికి సినిమాల ఎంపిక విషయంలో సలహాలు ఇస్తారని తెలుస్తోంది.