తెలంగాణ జానపదానికి దేశీయంగా విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. పల్లె భాష, భావుకత, వ్యవహారిక మాండలికం వెరసి తెలంగాణ జానపదం వీనులవిందుగా ఆబాలగోపాలాన్ని అలరిస్తుంటుంది. అందుకే ఓ మహాకవి దేశభాషలందు తెలుగు లెస్స అని అన్నాడు. అలాంటి ఆణిముత్యం వంటి ఓ తెలంగాణ జానపదాదాన్ని ‘లవ్‌స్టోరీ’ చిత్రంలో దృశ్యమానం చేశారు దర్శకుడు శేఖర్ కమ్ముల.