ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త టాలెంట్ కి కొదవ లేదు. ఎప్పటికప్పుడు పరిశ్రమలో కొత్తవాళ్లు పుట్టుకొస్తున్నారు. ఇక ముఖ్యంగా మ్యాటర్ ఉన్న డైరెక్టర్స్ పరిశ్రమలో రోజురోజుకూ పెరిగిపోతున్నారు. అందుకే స్టార్ హీరోలు కూడా స్టార్ డైరెక్టర్స్ కోసం ఎదురు చూడకుండా.. విషయం ఉందనుకుంటే.. కొత్త కుర్రాళ్ళతో కూడా సినిమాలు చేసుకంటూ ముందుకు పోతున్నారు.