హీరో నాని తాజాగా అల్లరి నరేష్ నటించిన నాంది సినిమా చూసి.. ట్వీట్ చేస్తూ.. "మొత్తానికి 'నాంది' సినిమా చూశాను. రేయ్ రేయ్ రేయ్.. 'అల్లరి నరేష్' పేరు మార్చేయ్ ఇంక.. అల్లరి గతం.. భవిష్యత్తుకు ఇది నాంది. ఒక గొప్ప నటుడిని నీలో చూశాను.చాలా సంతోషంగా ఉంది. ఇకపై ఇలాంటివి నీ నుంచి మరిన్ని రావాలని కోరు కుంటున్నాను.." అని నాని పోస్ట్ చేశారు.